News September 7, 2024
మహబూబ్‌నగర్: భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్లు జలమయం అయ్యాయి. తాండూర్-మహబూబ్‌నగర్ రోడ్డుపై రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన కల్వర్టులపై నుంచి వరద నీరు ప్రవహించింది. శుక్రవారం రాకపోకలు అగిపోయాయి.
Similar News
News October 12, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలిలా…
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 18.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 17.8 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 17.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో 15.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అల్వాలపాడులో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 12, 2024
14న అండర్-23 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) ఆధ్వర్యంలో అండర్-23 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నట్లు మహబూబ్ నగర్ క్రికెట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా Way2Newsతో మాట్లాడుతూ.. ఈనెల 14న ఎండీసీఏ మైదానంలో ఎంపికలు నిర్వహిస్తామని,ఆసక్తిగల క్రీడాకారులు జనన ధ్రువీకరణ,ఆధార్ కార్డు,తెల్లటి క్రీడా దుస్తులతో హాజరు కావాలన్నారు.
News October 12, 2024
MBNR: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.