News October 28, 2024

మహబూబ్‌నగర్: భార్య, అత్తపై వేటకొడవలితో దాడి

image

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో భార్య, అత్తపై అల్లుడు దాడి చేసిన విషయం తెలిసిందే. SI ప్రకారం.. లక్ష్మమ్మ-కుర్మన్న దంపతులు. కాగా, భార్యపై అనుమానంతో కుర్మన్న గొడవ పడి వెళ్లిపోయాడు. కుమార్తె ఒంటరిగా ఉండటంతో తల్లి నిర్మలమ్మ వచ్చింది. నిర్మలమ్మ కుర్మన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. మళ్లీ వీరి మధ్య గొడవ జరగగా.. లక్ష్మమ్మపై, అడ్డు వచ్చిన నిర్మలమ్మపై వేటకొడవలితో దాడి చేసి పారిపోయాడు. కేసు నమోదైంది.

Similar News

News November 5, 2024

 ధాన్యం కొనుగోళ్లు.. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారి

image

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంది. దీనికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ అధికారిని ప్రభుత్వం నియమించింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో వీరు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఐఏఎస్ అధికారి రవి నియమితులయ్యారు.

News November 5, 2024

శేష వాహనంపై కురుమూర్తి రాయుడు

image

చిన్నచింటకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి కురుమూర్తి స్వామివారు పద్మావతి సతీసమేతంగా శేషవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్య పల్లకి సేవ కొనసాగింది. ప్రధాన ఆలయం నుంచి మోకాళ్ళ గుండు వరకు స్వామివారు విహరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగాయి.

News November 5, 2024

రేపు కురుమూర్తి స్వామి అలంకరణ మహోత్సవం

image

రేపు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం అలంకరణ మహోత్సవం జరగనుంది. అమరచింత సంస్థానాధీశులైన ముక్కెర వంశస్థుల ఇలవేల్పు కురుమూర్తి స్వామికి 15వ శతాబ్దంలో స్వామివారికి రాజా సోమ భూపాల్ బంగారు ఆభరణాలు చేయించారు. ఏటా జరిగే అలంకరణ ఉత్సవంలో వీటిని స్వామి వారికి అలంకరిస్తారు.1976 నుంచిఆత్మకూరు SBIలో నగలు భద్రపరుస్తున్నారు. రేపు భారీ ఊరేగింపుగా పోలీసు బందోబస్తు ఆభరణాలు కురుమూర్తికి తీసుకొస్తారు.