News April 2, 2025
మహబూబ్నగర్: మంత్రి ధర్మేంద్రను కలిసిన మాజీ మంత్రి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూవివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బీఆర్ఎస్ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులపై దమనకాండ చేస్తోందని ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ భూములను కాపాడాలని, విద్యార్థులపై లాఠీఛార్జి చేశారన్నారు. వారికి న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.
Similar News
News December 10, 2025
ఓటు హక్కు వినియోగానికి 18 రకాల కార్డులు: కలెక్టర్

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 18 రకాల ధ్రువపత్రాల్లో దేనినైనా ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎలక్షన్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పోస్ట్ ఆఫీస్/బ్యాంకు పాస్ బుక్, పాన్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫొటోతో కూడిన కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు.
News December 10, 2025
గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల వైరస్ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.
News December 10, 2025
భవానీ దీక్షల విరమణ.. భద్రత కట్టుదిట్టం: సీపీ

విజయవాడ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాల నేపథ్యంలో సీపీ రాజశేఖర్ బాబు హోల్డింగ్ ఏరియాలు, సీసీ కెమెరాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న దీక్షా విరమణ, మహా పూర్ణాహుతి దృష్ట్యా బందోబస్తుకు వచ్చిన అధికారులకు విధులపై దిశానిర్దేశం చేశారు. సీతమ్మ వారి పాదాల వద్ద, మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన హోల్డింగ్ ఏరియాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.


