News April 7, 2025
మహబూబ్నగర్: మీ ఆరోగ్యం.. జర భద్రం..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాలమూరు డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, పొగతాగడం, ఒత్తిళ్లతో రోగాలు వస్తున్నాయన్నారు. మధుమేహం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, స్థూలకాయం, గుండెనొప్పి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
SHARE IT
Similar News
News October 20, 2025
శ్రీకాకుళంలో నేడు గ్రీవెన్స్ డేలు రద్దు

దీపావళి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) జరగాల్సిన గ్రీవెన్స్ డేను రద్దు చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు కలెక్టరేట్ గ్రీవెన్స్ డే సైతం రద్దు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. వచ్చే సోమవారం యథావిధిగా గ్రీవెన్స్ డే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News October 20, 2025
కొత్తగా 41 కాలేజీలు.. 10,650 ఎంబీబీఎస్ సీట్లు

2025-26 విద్యాసంవత్సరానికిగానూ 10,650 MBBS సీట్లకు NMC ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 1,37,600కు చేరనుంది. వీటిలో INIకు చెందిన సీట్లూ ఉన్నాయని వెల్లడించింది. దీంతో పాటు 41 నూతన మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలపగా మొత్తం విద్యాసంస్థల సంఖ్య 816కు పెరగనుంది. అటు పీజీ సీట్లు 5వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 67వేలకు చేరే అవకాశం ఉంది.
News October 20, 2025
పీజీఆర్ఎస్ కార్యక్రమం తాత్కలిక రద్దు: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సెలవు దినం కావడంతో ఇవాళ జరగాల్సిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం తాత్కలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలానికి రావొద్దని సూచించారు. జిల్లా ప్రజలు గమనించగలరని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.