News April 7, 2025

మహబూబ్‌నగర్: మీ ఆరోగ్యం.. జర భద్రం..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాలమూరు డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, పొగతాగడం, ఒత్తిళ్లతో రోగాలు వస్తున్నాయన్నారు. మధుమేహం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, స్థూలకాయం, గుండెనొప్పి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
SHARE IT

Similar News

News April 22, 2025

కర్నూలు జిల్లాలో ఆశాజనకంగా పత్తి ధరలు.!

image

కర్నూలు జిల్లాలో వారం రోజుల్లో పత్తి ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది గింజల ధర స్వల్పంగా పెరగడం, పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌కి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ఆదోని మార్కెట్‌లో సోమవారం పత్తి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.8,179 గా ఉంది. గత వారంతో పోలీస్తే రూ.200లకు పెరిగింది. కనిష్ఠ ధర రూ.4,509 ఉండగా సగటు ధర రూ.7,589కి పలికింది.

News April 22, 2025

భారీ జనసమీకరణకు సన్నాహాలు

image

27న వరంగల్‌లో BRS రజతోత్సవ సభకు ఉమ్మడి NLGలోని ప్రతీ నియోజకవర్గం నుంచి 10 – 15 వేల మందిని తరలించేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. MLA జగదీశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు జనసమీకరణలో బిజీ అయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. స్థానిక పోరుకు ముందు జరగనున్న ఈ సభ సక్సెస్ అయితే కారు పార్టీకి కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా.

News April 22, 2025

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

పెనమలూరు మండలం పెద్దపులిపాకలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రాజేష్ (29) విజయవాడ ఆటోనగర్లో వెల్డింగ్ పని చేసేవాడు. కొంతకాలం నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెదపులిపాకలోని తన ఇంట్లో సోమవారం సాయంత్రం రాజేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!