News March 31, 2025
మహబూబ్‌నగర్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

మహబూబ్‌నగర్ రూరల్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ముస్లిం ప్రజలు రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వ మానవ సమానత్వానికి, పవిత్రకు, త్యాగానికి, దాతృత్వానికి, మతసామరస్యానికి ప్రతీకలని వారన్నారు. కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News April 4, 2025
MBNR: ముగ్గురిపై కేసు నమోదు

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్‌తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్తో బిల్డింగ్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News April 4, 2025
మహబూబ్‌నగర్: రెడ్ క్రాస్ డయాగ్నొస్టిక్ స్థలానికి గవర్నర్‌కి ఎమ్మెల్యే వినతి

మహబూబ్‌నగర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్‌కు కేటాయించి అధునాతన భవన నిర్మాణానికి చేయూత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఎలాంటి లాభపక్ష లేకుండా ఎన్నో సంవత్సరాలుగా పట్టణ ప్రజలకు ఆపత్కాలంలో సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి ప్రాణం పోస్తున్నామన్నారు.
News April 4, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ఈనెల 7 నుంచి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జులు, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బి గ్రేడ్ రకానికి రూ.2,300 ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.