News January 6, 2025

మహబూబ్‌నగర్: స్థానిక పోరుకు సన్నద్ధం..!

image

ఉమ్మడి MBNR జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

Similar News

News February 23, 2026

MBNR: సౌత్ జోన్.. పీయూలో చెస్ ఎంపికలు

image

పీయూలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు చెస్ (పురుషుల) ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్రీడాకారులు ప్రతిభ చాటి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు, పీడీ డా.వై.శ్రీనివాసులు, కోచ్‌లు పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 1న నుంచి తమిళనాడులో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు.

News February 22, 2026

పాలమూరు: సీఎం కప్ నెట్‌బాల్ ఫైనల్‌కు నారాయణపేట జట్టు

image

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్-2026 నెట్‌బాల్ పోటీల్లో నారాయణపేట జిల్లా బాలుర జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు డా. శెట్టి రమేశ్, డా. రామ్మోహన్ గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగబోయే తుది పోరులో జట్టు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.

News February 21, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒ MBNR: క్రీడలతోనే మానసిక స్థైర్యం – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
✒ MBNR:AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ
✒ నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం.. కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
✒ ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో
✒ NGKL:SLBC పనులు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒ ఇంటర్ పరీక్షలపై ప్రత్యేక ఫోకస్