News August 9, 2024
మహబూబ్నగర్: ALERT.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా IAS, IPS అధికారుల పేరుతో దోపిడీకి ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కలెక్టర్ల పేరు, ఫొటోలతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు తాజాగా NGKL ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ డీపీతో ఫేక్ ఇన్స్టా ఖాతా తెరిచి పలువురికి మెసేజ్లు పంపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ.. ఇలాంటి వాటికి స్పందించవద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.
Similar News
News November 29, 2025
MBNR: పీయూలో కొత్త కాంటీన్ను ప్రారంభించనున్న వీసీ

PU విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన యూనివర్సిటీ క్యాంటీన్ను డిసెంబర్ 1న వైస్ ఛ ఛ ఛాన్స్లర్(వీసీ) ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహార వసతులను అందించేందుకు ఈ నూతన కాంటీన్ను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కంట్రోలర్, ప్రిన్సిపాల్స్, విభాగ అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హాజరు కావాలని రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేష్ బాబు తెలిపారు.
News November 29, 2025
జడ్చర్ల: విద్యార్థిపై దాడి.. పాఠశాలకు నోటీసులు

జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి గురించి స్థానిక న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయగా స్పందించిన కమిషన్ పాఠశాలకు నోటీసు జారీ చేసింది. ఈ విషయంపై విచారణ జరిపి డిసెంబరు 12వ తేదీన నివేదికను అందజేయాలని డీఈఓ ను కోరినట్లు, న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ తెలిపారు.
News November 28, 2025
MBNR: AHTU.. NOVలో 24 కార్యక్రమాలు: ఎస్పీ

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU)-2025 నవంబర్లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో మొత్తం 24 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళా భద్రత విభాగం హైదరాబాద్ ఆదేశాల మేరకు.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్పోల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఆపరేషన్ స్ట్రోమ్ మేకర్స్–3’ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.


