News April 5, 2025
మహబూబ్నగర్: ‘CM రేవంత్ రెడ్డికి THANKS’

DSC-2008 అభ్యర్థుల 15 సంవత్సరాల నిరీక్షణను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని DSC-2008 అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు మాలతి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేసినందుకు పాలాభిషేకం చేశారు. అనేక సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న తమకు సీఎం న్యాయం చేశారన్నారు. MBNR జిల్లా గండీడ్ మండల ఉపాధ్యాయులు ఉన్నారు.
Similar News
News April 6, 2025
మహబూబ్నగర్: శ్రీరాముని పాదం చూశారా?

MBNR జిల్లా కోయిలకొండలోని మహిమాన్విత క్షేత్రమైన శ్రీరామకొండ సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పాదం స్వయంభుగా వెలసిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ తన పాదం మోపి సేదతీరినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్లే సమయంలో ఇక్కడ ఒక మూలికపడి కొండ మొత్తం వనమూలికలకు ప్రసిద్ధగా మారిందని ప్రజలు నమ్ముతారు. ఇక్కడి కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఉండడం విశేషం.
News April 6, 2025
మహబూబ్నగర్: నేడు శ్రీరామకొండకు వెళ్తున్నారా..?

మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని శ్రీరామకొండపై వెలసిన స్వయంభు శ్రీరామపాద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామకొండ అర్చకుడు రాఘవేంద్రరావు తెలిపారు. శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి శ్రీరామకొండ వరకు శ్రీసీతారాముల పల్లకీ సేవ నిర్వహించామన్నారు. ఆదివారం ఉ.11.45 గంటలకు జరిగే కళ్యాణంలో భక్తులు పాల్గొనాలని కోరారు.
News April 6, 2025
మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు GOOD NEWS

మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి చించోలి వరకు జాతీయ రహదారి నెంబర్-167 ప్రధాన రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికులు, వాహనదారులు రాత్రి సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచించారు. మొత్తం రూ.706.08 కోట్ల వ్యయంతో 108 కిలోమీటర్ల రహదారిని మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు నిర్మిస్తున్నారు.