News December 31, 2024
మహబూబ్ నగర్‌కు హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాక

మహబూబ్ నగర్‌కు నేడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ వస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పై అధ్యయనం చేస్తారని తెలిపారు. ఇందుకు గాను జిల్లాలోని ఎస్సీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు MBNR కలెక్టరేట్లో హాజరై మాజీ న్యాయమూర్తికి విజ్ఞాపనలు సమర్పించి, చర్చించుకోవాలని తెలిపారు.
Similar News
News November 22, 2025
మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయండి: అదనపు కలెక్టర్

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్‌లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.
News November 22, 2025
MBNR: సాఫ్ట్ బాల్..200 మంది హాజరు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు మహబూబ్‌నగర్‌లోని స్టేడియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి హాజరయ్యారు. మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేణుగోపాల్, జగన్మోహన్ గౌడ్, బి.నాగరాజు, జి.రాఘవేందర్, మేరి పుష్ప, సుగుణ నాగమణి, రమణ, లక్ష్మీ నారాయణ క్రీడాకారులు పాల్గొన్నారు.
News November 22, 2025
MBNR: 24 గంటలు సిద్ధంగా ఉన్నాం.. ఫోన్ చేయండి: ఎస్పీ

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్స్టాండ్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.


