News April 15, 2025
మహబూబ్ నగర్ జిల్లాలో.. ఒకే రోజు ఐదుగురి మృతి

MBNR జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో సోమవారం ఐదు మంది మృతి చెందారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో పడి విజయ్, సుశాంత్, మహమ్మద్ మృతి చెందగా.. బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లిలో చేపల పేటకు వెళ్లి రాములును కాపాడబోయి యాదయ్య కూడా గల్లంతయ్యాడు. ఈ రెండు ఘటనలతో మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన ఐదుగురు నిరుపేద కుటుంబాలకు చెందినవారు.
Similar News
News April 17, 2025
PPM: మే 12వ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను మే 12వ తేదీ ప్రారంభం కానున్నట్లు డీఐఈఓ మంజుల వీణ తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఈ నెల 22 తేదీలోపు పరీక్ష పీజు చెల్లించేందుకు గడువు అని చెప్పారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్‌కి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
News April 17, 2025
విధ్వంసం.. 26 బంతుల్లో సెంచరీ

యూరోపియన్ క్రికెట్ సిరీస్(T10)-ఇటలీలో సంచలనం నమోదైంది. సివిడేట్ జట్టుతో మ్యాచ్‌లో మిలానో ప్లేయర్ జైన్ నఖ్వీ 26బంతుల్లోనే శతకం బాదారు. క్రికెట్ హిస్టరీలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అతను మొత్తంగా 37 బంతుల్లో 160* రన్స్(24 సిక్సర్లు, 2 ఫోర్లు) చేశారు. ఇన్నింగ్స్ 8, 10వ ఓవర్లలో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టారు. నఖ్వీ విధ్వంసంతో ఆ జట్టు 10 ఓవర్లలో 210/2 స్కోర్ చేయగా, ప్రత్యర్థి టీమ్ 106 పరుగులకే ఆలౌటైంది.
News April 17, 2025
అచ్చంపేట: ‘వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి’

అచ్చంపేట పట్టణంలో గురువారం సీపీఎం జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు మాట్లాడారు. జిల్లాలోని ప్రతి మండలంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.