News March 23, 2024

మహబూబ్ నగర్: త్రాగునీటికి నిధులు విడుదల!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పురపాలికలకు మంచినీటి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.NGKL-రూ.59.79 కోట్లు,WNPT-రూ.128.29 కోట్లు,MBNR-రూ.341.25 కోట్లు, NRPT- రూ.55.57 కోట్లు,GDWL- రూ.89.46 కోట్లు మంజూరయ్యాయి.వేసవిలో భూగర్భ జలాలు ఇంకి తరచూ పట్టణాల్లో తాగు నీటి సమస్య తలెత్తుతోంది.ఈ క్రమంలో అమృత్-2లో సమస్యకు చెక్ పెడుతూ నిధులు విడుదల చేశారు.

Similar News

News November 6, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి..TOP NEWS

image

✔ఘనంగా కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
✔నేటి నుంచి ప్రారంభమైన కులగణన సర్వే
✔వేరుశనగ ధర గిట్టుబాటు కాకపోవడం: రైతులు
✔లండన్‌లో పర్యటిస్తున్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
✔మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాలమూరు నేతలు
✔రోడ్లపై ధాన్యాన్ని పోసి ప్రమాదాలకు కారణం కాకూడదు: SIలు
✔దామరగిద్ద:గుండెపోటుతో సీనియర్ అసిస్టెంట్ మృతి
✔తప్పులు లేకుండా సర్వే చేయండి:కలెక్టర్లు

News November 6, 2024

MBNR: అంబులెన్స్‌లో EMTగా ఉద్యోగ అవకాశాలు

image

జిల్లాలోని 108 అంబులెన్స్‌లో మెడికల్ టెక్నీషియన్స్ కోసం ఈ నెల 9న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మేనేజర్ రవికుమార్ తెలిపారు. BSc-BZC, BSC Nursing, ANM, GNM, B-Pam, D-Pam, DMLT, MLT ఉత్తీర్ణులు అర్హులని తెలిపారు. 9న ఉ:10:00 నుంచి మ:3:00 వరకు జడ్చర్ల MPDO కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఒరిజినల్, జిరాక్స్‌ ధ్రువపత్రాలతో రావాలని సూచించారు.

News November 6, 2024

MBNR: సీఎం సహాయ నిధికి విరాళం అందజేత

image

రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గం సీఎం సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ చైర్మన్ కలిసి టీజీకాబ్ పాలకవర్గం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో TGCAB ఛైర్మన్ చైర్మన్ రావు తదితరులు పాల్గొన్నారు.