News April 25, 2024

మహబూబ్ నగర్:TTC ఫలితాలు విడుదల

image

గత ఫిబ్రవరిలో నిర్వహించిన టీటీసీ (టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్) ఫలితాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిందని MBNR,NGKL DEOలు రవీందర్, గోవిందరాజులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు https://portal.bsetelangana.org/DPSE1STYEARResultsjun/TSTCCresapr.aspx వెబ్ సైట్ లో ఫలితాలను చూసుకోవాలని సూచించారు.

Similar News

News January 26, 2025

జడ్చర్ల: లచ్చన్న దళం పేరుతో.. ఎమ్మెల్యేకి మావోయిస్టుల లేఖ

image

రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు లచ్చన్న దళం మావోయిస్టుల పేరుతో లేఖను అతికించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటికి మరోసారి లచ్చన్న దళం పేరుతో లేఖ రాశారు. ‘ఎమ్మెల్యేగా మంచిగా వ్యవహరించు.. గర్వం ఉంటే ఎప్పటికీ మంత్రి కాలేవు. దయచేసి జాగ్రత్తగా ఉండు. ఇట్లు లచ్చన్న దళం’ అంటూ లేఖలో ఉంది.

News January 26, 2025

MBNR: సంక్షేమ పథకాల అమలకు నేడే శ్రీకారం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.

News January 25, 2025

MBNR: BC స్టడీ సర్కిల్.. APPLY చేసుకోండి.!

image

ఉమ్మడి  బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ అభివృద్ధి అధికారి ఆర్.ఇందిర, డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 12,13,14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.