News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

Similar News

News September 15, 2025

కొడికొండ వద్ద మెగా పారిశ్రామిక జోన్

image

శ్రీ సత్యసాయి జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా మారనుంది. కొడికొండ చెక్‌పోస్టు సరిహద్దులో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు కేటాయించిన భూములు సహా 23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్, ఐటీ వంటి 16 కేటగిరీల పరిశ్రమల ఏర్పాటు కోసం జోన్లుగా విభజించి మాస్టర్‌ ప్లాన్ తయారీ బాధ్యతలను లీ అండ్ అసోసియేట్స్ సంస్థకు అప్పగించింది.

News September 15, 2025

మరో వివాదంలో పూజా ఖేడ్కర్

image

మహారాష్ట్రకు చెందిన మాజీ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ విషయంలో ఆమె పేరు బయటికి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ తన ట్రక్‌తో ఓ కారును ఢీకొట్టారు. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయగా పుణేలోని పూజా ఇంటిలో చూపించింది. డ్రైవర్‌ను విడిపిస్తున్న క్రమంలో పూజా తల్లి మనోరమ హంగామా చేశారు.

News September 15, 2025

KNR: యూరియా బ్లాక్‌లో అమ్ముతున్నా చర్యలేవి..?

image

రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని MP బండి సంజయ్ అన్నారు. సరైన ప్లాన్ లేకపోవడం, యూరియాను బ్లాక్‌లో అమ్ముతున్నా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందన్నారు. రబీ సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం పంపితే, 2.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మిగిలిందని, దాన్ని ఏం చేశారో కూడా లెక్కా పత్రం లేదన్నారు. వందే భారత్ ప్రారంభోత్సవం వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.