News February 19, 2025
మహమ్మద్ నగర్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మద్ నగర్లో జరిగింది. SI శివకుమార్ వివరాలిలా.. మోహన్ (28) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పాత సామాను ఏరుకొని వచ్చిన డబ్బులను మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ కాగా, సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయి, స్మశాన వాటిక వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవాళ మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు కేసు నమోదైంది.
Similar News
News December 19, 2025
డీసీసీ బ్యాంక్ ఛైర్మన్గా ఖమ్మం కలెక్టర్ బాధ్యతలు

ఖమ్మం జిల్లా డీసీసీ బ్యాంకు ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని నియమించింది. శుక్రవారం కలెక్టరేట్లో డీసీసీ బ్యాంక్ ఛైర్మన్గా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
News December 19, 2025
మహబూబాబాద్: ‘నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు’

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపారు. ఫ్లిప్కార్ట్ సంస్థల్లో డెలివరీ బాయ్స్, గర్ల్స్ నిరుద్యోగులకు ఈనెల 20న జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్, బైక్, స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు సబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
News December 19, 2025
శ్రీకాకుళం జిల్లా సైనిక అధికారులుకి గవర్నర్ ప్రశంస

విజయవాడలోని లోక్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అధికారులును గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ, టైపిస్ట్ మురళి చేస్తున్న ఉత్తమ సేవలకు గాను గవర్నర్ చేతుల మీదగా సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందుకున్నారు. సేవలు మరింత విస్తృతం చేయాలని గవర్నర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత ఉన్నారు.


