News February 19, 2025

మహమ్మద్ నగర్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మద్ నగర్‌లో జరిగింది. SI శివకుమార్ వివరాలిలా.. మోహన్ (28) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పాత సామాను ఏరుకొని వచ్చిన డబ్బులను మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ కాగా, సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయి, స్మశాన వాటిక వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవాళ మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు కేసు నమోదైంది.

Similar News

News March 23, 2025

విశాఖలో IPL మ్యాచ్‌కు స్పెషల్ బస్సులు

image

విశాఖలో సోమవారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఏపీఎస్ఆర్టీసీ 30 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియానికి నడపనున్నారు. ఈ స్పెషల్ బస్సులు గాజువాక, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, సింహాచలం, కూర్మన్నపాలెం నుంచి మధురవాడకు నడపనున్నట్లు వెల్లడించారు. రద్దీ అనుగుణంగా బస్సులు పెంచుతామన్నారు. ప్రయాణీకులు గమనించాలని కోరారు.

News March 23, 2025

27న పోలవరానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.

News March 23, 2025

కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

image

రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.

error: Content is protected !!