News January 30, 2025

మహాకుంభమేళా మృతులకు ఎంపీ వద్దిరాజు సంతాపం

image

మహాకుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సంతాపం తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్న క్రమంలో సరైన ఏర్పాట్లు కల్పించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News November 22, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} తిరుమలాయపాలెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} ఖమ్మంలో నేడు జాబ్ మేళా
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News November 22, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} తిరుమలాయపాలెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} ఖమ్మంలో నేడు జాబ్ మేళా
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News November 22, 2025

ఖమ్మం: గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

image

ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26కి 5 నుంచి 9వ తరగతులల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అర్హులైన వారు నవంబర్ 25 సాయంత్రం 5 వరకు ఖమ్మం అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. వీటీజీ/బీఎల్‌వీ సెట్ రాసిన వారికి ప్రాధాన్యత, ఇతరులకు లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు.