News February 6, 2025
మహాకుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్య క్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. దేవస్థానంలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేకం మహోత్సవాల రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్‌ను గురువారం ఆయన ప్రకటించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 11, 2026
వెనక్కి తగ్గిన నువాన్ తుషార

IPLలో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు NOC ఇవ్వట్లేదని కోర్టుకెక్కిన నువాన్ తుషార వెనకడుగు వేశారు. కేసును వెనక్కి తీసుకోవడంతో పాటు బోర్డుకు సారీ చెప్పారు. గవర్నింగ్ బాడీని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని మెయిల్ పంపారు. బోర్డు తన పట్ల పారదర్శకంగా వ్యవహరించలేదని, న్యాయం కోసం అలా చేశానని పేర్కొన్నారు. SL బోర్డు NOC ఇవ్వకపోవడంతో RCBకి ప్రాతినిధ్యం వహించాల్సిన తుషార ఇంకా జట్టులో జాయిన్ కాలేదు.
News April 11, 2026
నేరరహిత గ్రామాలే లక్ష్యం కావాలి: ఎస్పీ శబరీశ్

తొర్రూరు మండలం చర్లపాలెంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఎస్పీ శబరీశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలు నేరరహితంగా మారేందుకు నూతన సర్పంచ్‌లు చొరవ చూపాలని కోరారు. సీసీ కెమెరాల నిఘా వల్ల భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే, రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. సర్పంచ్ మహేందర్ పాల్గొన్నారు.
News April 11, 2026
ప్రకాశం: ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

ఒంగోలులో ఒపెన్ ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. స్థానిక D.R.R.M మున్సిపల్ హైస్కూల్‌లో ఈనెల 11 నుంచి 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు DEO, క్యాంప్ ఆఫీసర్ P.V రేణుక తెలిపారు. అయితే త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


