News August 15, 2024

మహాత్ముని మాట.. పెద్దవడుగూరులో విరాళాల వెల్లువ

image

అనంతపురం జిల్లాలో పెద్దవడుగూరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ 1934 SEP 21న పర్యటించారు. బహిరంగసభలో ప్రసంగించగా చైతన్యవంతులై దేశభక్తి భావాలు కలిగిన కొందరు ప్రతిస్పందించారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం అప్పట్లోనే దాదాపు రూ.27 వేలు విరాళంగా అందజేశారు. చింతలచెరువుకు చెందిన భూస్వామి హంపమ్మ తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేయడంతో పాటు రూ.1,116ల నగదును గాంధీకి విరాళంగా ఇచ్చారు.

Similar News

News November 14, 2025

రైలు ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం

image

పెద్దపప్పూరు మండల పరిధిలోని జూటూరు-కోమలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

News November 13, 2025

10 మంది ఉద్యోగులకు ఎంపీడీఓలుగా పదోన్నతి!

image

అనంతపురం జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న 10 మందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)గా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తన క్యాంపు కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు పంచాయతీరాజ్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

News November 13, 2025

భార్యను హతమార్చిన భర్త

image

అనంతపురం జిల్లా బెలుగుప్పలో గురువారం దారుణ ఘటన జరిగింది. భార్యను భర్త హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. భార్య శాంతిని భర్త ఆంజనేయులు కొడవలితో నరికి చంపాడు. హత్య తర్వాత నిందితుడు బెలుగుప్ప పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.