News August 15, 2024

మహాత్ముని మాట.. పెద్దవడుగూరులో విరాళాల వెల్లువ

image

అనంతపురం జిల్లాలో పెద్దవడుగూరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ 1934 SEP 21న పర్యటించారు. బహిరంగసభలో ప్రసంగించగా చైతన్యవంతులై దేశభక్తి భావాలు కలిగిన కొందరు ప్రతిస్పందించారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం అప్పట్లోనే దాదాపు రూ.27 వేలు విరాళంగా అందజేశారు. చింతలచెరువుకు చెందిన భూస్వామి హంపమ్మ తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేయడంతో పాటు రూ.1,116ల నగదును గాంధీకి విరాళంగా ఇచ్చారు.

Similar News

News September 8, 2024

హౌరా నుంచి యశ్వంతపూర్ వరకు రైలు పొడిగింపు

image

హౌరా నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు నడుస్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (22831/32)ను యశ్వంతపూర్ వరకు పొడిగించారు. ఇది హౌరా నుంచి ధర్మవరం వరకు యథావిధిగా నడుస్తుంది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి రాత్రి 9:30 గంటలకు చేరుకుని హిందూపురం, యలహంక(స్టాపులు) మీదుగా యశ్వంత్‌పూర్‌కి రాత్రి 12:15కు చేరుకుంటుంది. తిరిగి యశ్వంత్‌పూర్‌లో ఉదయం 5కు బయలుదేరి ప్రశాంతి నిలయానికి ఉదయం7:53కి చేరుకుంటుంది.

News September 7, 2024

శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇనాయతుల్లా

image

శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంహెచ్.ఇనాయతుల్లాను నియమిస్తూ ఎఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. ఆయనను హిందూపురంలోని తన నివాసంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇనాయతుల్లా మాట్లాడుతూ.. తనకు ఈ గుర్తింపు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

News September 7, 2024

అనంతలో దులీప్ ట్రోఫీ.. D టీమ్‌పై C టీమ్ ఘన విజయం

image

దులీప్ ట్రోఫీ టోర్నీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో D టీమ్‌పై C టీమ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ సాగింది ఇలా..
☞ D టీమ్ తొలి ఇన్నింగ్స్ 164/10
☞ C టీమ్ తొలి ఇన్నింగ్స్ 168/10
☞ D టీమ్ 2వ ఇన్నింగ్స్ 236/10
☞ C టీమ్ రెండో ఇన్నింగ్స్ 61 ఓవర్లలో 233/6
☞ ఫలితం: C టీమ్ 4 వికెట్ల తేడాతో విజయం
☞ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మానవ్ సుతార్ (7 వికెట్లు)