News December 11, 2024

‘మహాదీపం’ వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

image

అరుణాచలేశ్వర దేవాలయంలో ఈనెల 13న జరిగే ‘మహాదీపం’కు వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 13వ తేదీ జరిగే మహాదీపం కార్యక్రమానికి వెళ్లే భక్తులు అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిత్తూరు రహదారి గుండా వెళ్లే భక్తులకు అరుణాచలంలోని వేలూరు రహదారిలో తాత్కాలిక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News November 25, 2025

అనంత: ఆ నిందితులకు 14 రోజుల రిమాండ్

image

అనంతపురం సాయి నగర్ 3rd క్రాస్‌లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు మొత్తం ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించామన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు ఒక మోటార్ సైకిల్ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

News November 25, 2025

అనంత: ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు

image

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలు, RTC బస్‌స్టాండ్ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను కట్టించాలని కలెక్టర్ అన్నారు.