News February 10, 2025

మహాదేవపూర్: చెరువులో పడి వ్యక్తి మతి

image

చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మహాదేవపూర్ మండలంలో జరిగింది. పోలీసుల కథనమిలా.. మండల కేంద్రంలోని ఎర్రచెరువుకు మేడం నాగేందర్ (46) బహిర్భూమి కోసం వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. మృతుడిది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి అని తెలిపారు. మృతుడి భార్య అనితా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News October 21, 2025

విశాఖ జూపార్క్ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య

image

విశాఖ జూ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. డెయిరీ ఫారం నుంచి ఎండాడ వైపు వెళ్తున్న జాతీయ రహదారి పక్కన చెట్టు కొమ్మకు ఓ వ్యక్తి ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళన చెందారు. వీరి సమాచారంతో ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 21, 2025

రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్

image

రామగుండంలో 80O మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లినట్లు MLA- MSరాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను HYDలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకుర్తి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి గ్రామాలకు తాగు నీరు, పంటలకు సాగునీరు అందివ్వాలని కోరారు.

News October 21, 2025

డీజే ఓ నిశ్శబ్ద హంతకి

image

పట్టణం, పల్లెలో డీజే శబ్దాలు హోరెత్తిస్తున్నాయి. శబ్ద తీవ్రత 50 డేసిబెల్స్ దాటితే మానవులకు గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలను నిర్వాహకులు పెడచెవిన పెట్టి పెద్ద శబ్దాలకు 100 డేసిబెల్స్‌ పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల16న నరసన్నపేటలోని <<18018296>>భవానిపురంలో<<>> గౌరమ్మ ఊరేగింపులో డీజే శబ్దానికి భవనం కూలి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.