News February 10, 2025

మహాదేవపూర్: చెరువులో పడి వ్యక్తి మతి

image

చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మహాదేవపూర్ మండలంలో జరిగింది. పోలీసుల కథనమిలా.. మండల కేంద్రంలోని ఎర్రచెరువుకు మేడం నాగేందర్ (46) బహిర్భూమి కోసం వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. మృతుడిది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి అని తెలిపారు. మృతుడి భార్య అనితా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News March 15, 2025

సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్‌తో 365 రోజులు..

image

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ అందిస్తోంది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్‌గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్.

News March 15, 2025

SKLM: ‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు అమలు చేయాలి’

image

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా ఇన్ ఛార్జ్ అధికారి శశిభూషణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జేసీ ఫర్మాన్ అహ్మద్‌లతో కలిసి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి శశిభూషణ్ కుమార్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా వివరాలను తెలియజేశారు.

News March 15, 2025

జనగామ: రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

image

నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ ఎడమ, కుడి కాలువల నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కుడి కాలువ ద్వారా జనగామ మరియు బచ్చన్నపేట మండలం పరిధిలోని పలు గ్రామాలలో 15000 ఎకరాలకు, అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా నర్మెట మరియు రఘునాథపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాలలో 6000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు.

error: Content is protected !!