News April 3, 2025

మహాదేవపూర్: పెచ్చులూడుతున్న క్యూలైన్ గోడలు

image

మహాదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాళేశ్వరం దేవస్థానంలో క్యూలైన్ గోడలు పెచ్చులూడి భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. సరస్వతి పుష్కరాలు సమీపిస్తున్న వేళ భక్తుల రద్దీ పెరిగి ఈ క్యూలైన్ ద్వారానే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని భక్తులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు పెచ్చులూడుతున్న ప్రాంతాలను మరమ్మతులు చేపించి ప్రమాదాలు జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Similar News

News January 11, 2026

రైతు భరోసా… ఇంకెంతకాలం నిరీక్షణ!

image

రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం జిల్లాలోని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదార్ రైతులు ఉండగా యాసంగి సీజన్‌పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది జనవరి 26నే ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కాగా.. ఈసారి నవంబర్‌లో సీజన్ ప్రారంభమై ఈ నెలాఖరుకు ముగుస్తున్నా నిధుల ఊసే లేదు. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

News January 11, 2026

KNR: ఊరికెళ్తున్నారా.. ఇల్లు భద్రం: సీపీ

image

సంక్రాంతి, మేడారం జాతర నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని KNR CP గౌష్‌ ఆలం సూచించారు. విలువైన ఆభరణాలు, నగదును వెంట తీసుకెళ్లడం, బ్యాంక్ లాకర్లలో ఉంచడం శ్రేయస్కరమన్నారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఊరెళ్లే సమాచారాన్ని పోలీసులకు తెలపాలని కోరారు. సోషల్ మీడియాలో పర్యటనల వివరాలు పంచుకోవద్దని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలన్నారు.

News January 11, 2026

కరీంనగర్: బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే బదిలీ

image

కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన రఫీక్ ఖాన్ రెండు రోజులకే బదిలీ అయ్యారు. జగిత్యాల వీఆర్ నుంచి ఇక్కడికి వచ్చిన ఆయనను ఉన్నతాధికారులు సీసీఆర్‌బీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయనపై ఉన్న పలు ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.