News December 12, 2024

మహానందిలో భక్తజన సందడి

image

మహానంది ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఆలయ ప్రాంగణంలో వివాహాలు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరులలో స్నానాలు ఆచరించారు. అయ్యప్ప స్వామి దీక్ష దారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరూ సాధారణ, ప్రత్యేక, స్పర్శ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

Similar News

News December 27, 2025

21,033 మంది శక్తి యాప్‌ డౌన్‌లోడ్: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలోని విద్యాసంస్థల్లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై శక్తి టీమ్‌లు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శక్తి యాప్, డయల్ 112, 1930 వంటి సేవల వినియోగంపై విద్యార్థినులకు వివరించామన్నారు. జనవరి నుంచి డిసెంబర్ 27 వరకు జిల్లాలో 21,033 మంది శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు.

News December 27, 2025

డిసెంబర్ 29న పీజీఆర్ఎస్: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈ నెల 29న (సోమవారం) ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల, మున్సిపల్, డివిజన్ కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ అర్జీల పరిష్కార స్థితిని కాల్ సెంటర్ నంబర్ 1100 లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని ఆమె సూచించారు.

News December 27, 2025

కర్నూలు జిల్లాలో 17,089 ఓపెన్ డ్రింకింగ్ కేసులు: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 17,089 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇకపై బహిరంగ మద్యపానాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.