News December 12, 2024

మహానందిలో భక్తజన సందడి

image

మహానంది ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఆలయ ప్రాంగణంలో వివాహాలు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరులలో స్నానాలు ఆచరించారు. అయ్యప్ప స్వామి దీక్ష దారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరూ సాధారణ, ప్రత్యేక, స్పర్శ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

Similar News

News January 14, 2025

నంద్యాల: లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెకు చెందిన శివరాఘవ రెడ్డి(22) సూసైడ్ చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పీఆర్‌టీ సర్కిల్ వద్ద గల కృష్ణ లాడ్జిలో అద్దెకు తీసుకున్న రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మృతుడు బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 14, 2025

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

నంద్యాలలో మంగళవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. శిరివెళ్లకు చెందిన అత్తార్ అస్లాం(26), తిమ్మాపురం గ్రామానికి చెందిన కాకాని కళ్యాణ్ బైక్‌పై సంజీవ నగర్ నుంచి శ్రీనివాస సెంటర్ వస్తున్నారు. మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. తీవ్ర గాయాలతో అస్లాం మృతి చెందాడు. గాయపడిన కళ్యాణ్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 14, 2025

‘సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

సంక్రాంతి పండగ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. సోమవారం బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురంలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, మహిళలపై నేరాలు, చీటింగ్‌లపై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయి సమస్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, డెయిల్ 100, 1930, 112 టోల్ ఫ్రీ నంబర్ల ఉపయోగాలను ప్రజలకు వివరించారు.