News September 15, 2024
మహానందిలో భక్తుల సందడి
మహానంది ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా కనిపిస్తుంది. సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చారు. కోనేరులలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కొనసాగుతుంది. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణాలు తిలకించారు.
Similar News
News October 10, 2024
నంద్యాల చిత్రకారుడి ప్రతిభ.. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపం
నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ మరోసారి తన టాలెంట్ చూపెట్టారు. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపాన్ని చిత్రీకరించి అబ్బురపరిచారు. బాబాపై ఉన్న భక్తి, ప్రేమతో ఈ చిత్రాన్ని వేసినట్లు ఆయన తెలిపారు. ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అన్న నినాదం ఈ చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ప్రస్తుత సమాజానికి బాబా బోధనలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
News October 10, 2024
100 రోజుల ప్రణాళికలను సాధించాలి: కలెక్టర్
డిసెంబర్ 31వ తేది లోపు రెండో దశ 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 100 రోజులు లక్ష్యాల (ఫేజ్-II)పై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలకు సంబంధించిన రెండో దశ 100 రోజుల లక్ష్యాల సాధనపై సమీక్షించారు. లక్ష్య సాధనలో వెనకబడకూడదని ఆదేశించారు.
News October 10, 2024
సీఎం హామీలను నెరవేర్చాలి: కలెక్టర్
పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో సీఎం పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం హామీల సాధనపై సమీక్ష నిర్వహించారు. హౌసింగ్‌కు సంబంధించి 203 దరఖాస్తులు వచ్చాయని, వీటిని మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 40 మందికి ఇళ్ల స్థలాల మంజూరుకు భూమిని గుర్తించాలని డీఆర్ఓను అదేశించారు.