News April 15, 2025
మహానందిలో మిస్టరీగానే వ్యక్తి మరణం

మహానంది సమీపంలోని అరటి తోటలో నిన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వివరాల కోసం రంగంలోకి దిగన ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా మృతదేహానికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మహానందిలోని ఈశ్వర్ నగర్ శివారులో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.
Similar News
News November 21, 2025
తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో స్కూళ్లలో ఓపెన్ గ్రౌండ్ క్రీడలను నిషేధించే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాధారణంగా వింటర్ సీజన్‌లో ఢిల్లీలోని స్కూల్స్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తుంటాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గేమ్స్ రద్దు అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. కాగా ఇండోర్ గేమ్స్ నిర్వహణకూ సౌకర్యాలు కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
News November 21, 2025
సిద్దిపేట: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట కలెక్టరేట్ పక్కన ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ పరిశీలనలో భాగంగా గోదాం చుట్టూ వీక్షించి రక్షణ చర్యలను పరిశీలించారు. లాగ్ బుక్ చెక్ చేసి విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చుట్టు సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ అధికారులు 24/7 పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
News November 21, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. ‘రెబల్ సాబ్’ అనే సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.


