News April 15, 2025
మహానందిలో మిస్టరీగానే వ్యక్తి మరణం

మహానంది సమీపంలోని అరటి తోటలో నిన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వివరాల కోసం రంగంలోకి దిగన ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా మృతదేహానికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మహానందిలోని ఈశ్వర్ నగర్ శివారులో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.
Similar News
News April 23, 2025
విజయవాడ జైలుకు PSR.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

AP: ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబై నటి జెత్వానీపై కేసు నమోదు చేయాలని ఆయన IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీలకు చెప్పినట్లు తేలింది. మహిళపై అక్రమ కేసు నమోదుకు అధికారులను ప్రభావితం చేశారని పోలీసులు వెల్లడించారు. PSR ఆదేశాలతో పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో నకిలీ ఆధారాలు సృష్టించినట్లు రిపోర్టు వెల్లడించింది. అటు PSRను విజయవాడ జైలుకు తరలించారు.
News April 23, 2025
నర్సాపురం హైస్కూల్‌ను సందర్శించిన కలెక్టర్

దుమ్ముగూడెం మండలం నరసాపురం పాఠశాలలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం సందర్శించారు. పాఠశాల ఆవరణంలోని వంట షెడ్డును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు పంపిణీ చేసిన సైకిళ్లకు పంచర్ కిట్లను సరఫరా చేస్తానని అన్నారు. పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News April 23, 2025
నా హృదయం ముక్కలైంది: రోహిత్ శర్మ

పహల్‌గామ్ ఉగ్రదాడిని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించారు. తన హృదయం ముక్కలైందనే భావన వ్యక్తపరుస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ఆయన తన ఇన్‌స్టాలో క్యాప్షన్‌గా పెట్టారు. అలాగే ఈ దాడిని పలువురు సెలబ్రిటీలు కూడా ఖండించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.