News March 18, 2025
మహానందిలో విషాదం.. ఒకరు మృతి

మహానంది దేవస్థానంలో ఉన్న నాగనంది సదనం ఆవరణలో వసతి గృహాలను కూలుస్తున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. నూతనంగా 50 వసతి గృహాల సముదాయం కోసం ప్రస్తుతం ఉన్న వసతి గృహాలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూల్చివేత పనులు చేస్తుండగా పెళ్లలు పడి నంద్యాల మండలం పెద్ద కొట్టాలకు చెందిన రాముడు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 14, 2025
వరి: సెప్టెంబర్లో ఎరువుల యాజమాన్యం ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు దాదాపు <<17675869>>పూర్తయ్యాయి<<>>. పంట వివిధ దశల్లో ఉంది. పిలక దశలో ఉన్న పైర్లలో ఎకరానికి 35KGల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో ఉంటే 35KGల యూరియాతోపాటు 15KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి. పిలకలు వేసే దశలో పొలంలో కనీసం 2CM వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. కాగా ఈ నెలలో వరినాట్లు వేయరాదు. వేస్తే పూత దశలో చలి వల్ల గింజ పట్టక దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
News September 14, 2025
HZB: సైబర్ నేరగాళ్లను తెలివిగా బోల్తా కొట్టించిన తల్లి

సైబర్ నేరగాళ్ల నుంచి KNR(D) HZBకు చెందిన సుస్రత్ అనే మహిళ తెలివిగా తప్పించుకుంది. ఆమె కూతురు పోలీసుల కస్టడీలో ఉందని సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. కేసు పరిష్కారం కోసం వెంటనే రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట్లో భయపడినప్పటికీ, ఆమె వెంటనే తేరుకుని తన కూతురు చదువుతున్న కాలేజీకి వెళ్లింది. అక్కడ ఆమె కూతురు క్షేమంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 14, 2025
ప్రకాశం లోక్ అదాలత్లో 6558 క్రిమినల్ కేసులు పరిష్కారం

ప్రకాశం జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తెలిపిన వివరాల ప్రకారం.. అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో 167 సివిల్ కేసులు, 6558 క్రిమినల్ వ్యాజ్యాలు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.