News January 25, 2025
మహానందిలో 1.20లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతాం: ఈవో
మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది 1,10,000 లడ్డూ ప్రసాదాలు విక్రయించామని మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాలు సరిపడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం 1,20,000 లడ్డూలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాలు విక్రయిస్తామన్నారు.
Similar News
News January 27, 2025
రేపు నల్గొండకు KTR
నల్గొండకు మంగళవారం BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు BRS పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నల్గొండకు చేరుకుంటారన్నారు. క్లాక్ టవర్ వద్ద జరిగే రైతు మహాసభలో ఆయన పాల్గొంటారన్నారు. కాగా, కోర్టు అనుమతితో రేపు నల్లగొండలో రైతు మహాధర్నాను బీఆర్ఎస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
News January 27, 2025
దేవాలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎస్పీ
కృష్ణా జిల్లాలోని ఉన్న అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ గంగాధర్ రావు అధికారులకు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఎస్పీ సోమవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలన్నారు.
News January 27, 2025
SKLM: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం: కలెక్టర్
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఆడపిల్లల తక్కువ జననాలు సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, హిరమండలం, సంతబొమ్మాళి మండలాల్లో నమోదవుతున్నాయని వెంటనే ఆయాచోట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.