News February 15, 2025
మహానంది: ఆకతాయికి వారం రోజుల జైలు శిక్ష

మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ సింగ్ మద్యం తాగి ఈ నెల 12న దారిలో వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శుక్రవారం జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారం రోజుల జైలుశిక్ష విధించినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నిందితుడిని సబ్ జైలుకు తరలించామని అన్నారు.
Similar News
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్, సిఎంఆర్ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.


