News September 23, 2024
మహానంది ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా శోభారాణి
మహానంది డిప్యూటీ కమిషనర్‌గా రాష్ట్ర దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న డీసీ.శోభారాణిని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహానంది ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి పల్నాడు జిల్లాలోని అమరేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా బదిలీ చేశారు.
Similar News
News October 5, 2024
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు నేడు సెలవు
ఆదోనిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవన్నారు. రెండ్రోజులుగా వర్షం కురుస్తుండగా తుఫాను ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిన్న కురిసిన వర్షానికి మార్కెట్‌కు తెచ్చిన వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయని తెలిపారు.
News October 5, 2024
స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్
స్వర్ణాంధ్ర @2047 ప్రణాళికలో భాగంగా రాబోయే 23 సంవత్సరాలలో నంద్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక రచన సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక పత్ర ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాల స్టేక్ హోల్డర్స్‌లతో జిల్ల స్థాయి సమీక్ష నిర్వహించారు.
News October 4, 2024
నంద్యాల: ‘డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తాం’
నంద్యాల నందమూరి నగర్‌కు చెందిన మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యారు. డెలివరీ అయిన 8 రోజులకు ఆరోగ్యం సరిగాలేక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు 14 రోజులు ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందించారు. అయితే ఆ మహిళ మృతి చెందారు. వైద్య సేవలకు రూ.3.30 లక్షల బిల్లు అయింది. డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో ఆసుపత్రి ఎదుట బాధితులు నిరసన చేపట్టారు.