News December 21, 2024
మహానంది ఏపీ మోడల్ స్కూలుకు జాతీయ అవార్డు

పర్యావరణం, జీవ వైవిధ్యం పట్ల సున్నితమైన ఆలోచనలను సమాజంలో పెంపొందించే లక్ష్యంతో విప్రో సంస్థ విప్రో ఎర్తియన్ పేరుతో అందించే జాతీయ అవార్డును మహానంది మోడల్ స్కూల్ సొంతం చేసుకుందని ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ద్వారా 1,550కి పైగా వచ్చిన ప్రాజెక్టుల నుంచి తమ పాఠశాల పంపిన జీవ వైవిధ్యం ప్రాజెక్ట్‌కు జాతీయ అవార్డు వరించిందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 12, 2026
కర్నూలులో 3.1 కిలోల గంజాయి స్వాధీనం.. 8 మంది అరెస్ట్

కర్నూలు టౌన్ బళ్లారి చౌరస్తా సమీపంలోని వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు దాడి చేసి 3.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఫోర్త్ టౌన్ సీఐ విక్రమ్ సింహ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు సహా కొనుగోలు, పంపిణీకి వచ్చిన మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితులు అరకు ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 11, 2026
ఆదోని వద్ద ఘోర ప్రమాదం (UPDATE)

ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి కారులో బయలుదేరారు. ఆదోని పట్టణ శివారు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో సిప్రా మృతిచెందగా, గాయాలైన ముగ్గురినీ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ ఎస్సై మహేశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.