News May 11, 2024

మహానంది: పండుగ వాతావరణం ఉట్టిపడేలా పోలింగ్ కేంద్రాలు ముస్తాబు

image

ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు వజ్రాయుధమని తిమ్మాపురం గ్రామం రెవిన్యూ అధికారి సురేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా మామిడాకులు, అరటి చెట్ల తోరణాలు అలంకరించి, ఓటర్లకు స్వాగతం ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Similar News

News April 9, 2026

పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ సిరి

image

కర్నూలు జిల్లాలో ఈనెల 9 నుంచి 23 వరకు జరగనున్న పోషణ పక్వాడ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పోషణ పక్వాడ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 2 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్, టీవీ స్క్రీన్‌లను పూర్తిగా దూరం పెట్టాలని సూచించారు. జంక్ ఫుడ్స్‌కు బదులుగా పప్పులు, పల్లీలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.

News April 9, 2026

పాత వాహనాల కొనుగోలులో జాగ్రత్తలు: ఎస్పీ

image

పాత వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తక్కువ ధరకు వస్తున్నాయని రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దని హెచ్చరించారు. వాహనం కొనుగోలు ముందు ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీ వివరాలు RTA వెబ్‌సైట్‌లో చెక్ చేయాలని సూచించారు. చాసిస్, ఇంజిన్ నంబర్లు ఆర్సీతో సరిపోల్చాలన్నారు. విక్రేత అసలు యజమానా, కాదో నిర్ధారించుకోవాలన్నారు.

News April 9, 2026

చండ్ర రాజేశ్వరరావు మహానేత: సీపీఐ నేత రామకృష్ణ

image

చండ్ర రాజేశ్వరరావు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన మహానేత అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. పత్తికొండ సీపీఐ కార్యాలయంలో చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి, పేదలకు భూములు పంచిన త్యాగశీలి అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.