News March 9, 2025
మహానంది: రెండు బర్రెలు మృతి.. బాలుడి తలకు గాయాలు

నంద్యాల-గుంటూరు రైల్వే మార్గంలో గాజులపల్లె రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో రెండు బర్రెలు మృతి చెందగా ఎంసీ ఫారం గ్రామానికి చెందిన బాలుడు శ్యామ్‌కు కంకర రాయి తగిలి తలకు గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా బర్రెలు అడ్డు రావడంతోనే గూడ్స్ రైలు అదుపు తప్పి పట్టాలు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Similar News
News November 2, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నల్గొండలో వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.
News November 2, 2025
NZB: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఏర్పాటు

తెలంగాణ జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్ పెట్టారు. తాజాగా టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్‌ను నియమించినట్లు ఆమె తెలిపారు. వెంటనే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని కవిత పేర్కొన్నారు.
News November 2, 2025
HYD: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఏర్పాటు