News August 18, 2024

మహానంది వ్యవసాయ కళాశాల @31 ఏళ్లు

image

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మహానంది వ్యవసాయ కళాశాల ఏర్పడి నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఈ కళాశాలను స్థాపించారు. ఎందరినో శాస్త్రవేత్తలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్‌లను తయారు చేసిన ఘనత ఈ కాలేజీకి ఉందన్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు పలు దేశాలలో ఇక్కడి విద్యార్థులు ఉన్నత పదవుల్లో విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News September 13, 2024

మంత్రి బీసీ ఆధ్వర్యంలో 18న మెగా జాబ్ మేళా

image

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 18న బనగానపల్లె డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సతీమణి బీసీ ఇందిరారెడ్డి వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు 9 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. 1,191 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులన్నారు.

News September 13, 2024

నగదు వసూలు చేస్తే చర్యలు: కలెక్టర్

image

ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ల నుంచి నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను అదేశించారు. గురువారం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కింద వస్తే ఉచితంగా చికిత్స ఇవ్వాలని, లేకపోతే అప్పుడు వారి నుంచి నగదు తీసుకునే ప్రక్రియను అన్ని ఆసుపత్రులు పాటించాలని అన్నారు.

News September 13, 2024

నంద్యాల: కుందూ నదిలో ఇద్దరు గల్లంతు

image

కోయిలకుంట్ల మండలం కలుగొట్ల సమీపంలోని కుందూ నదిలో గురువారం సాయంత్రం ఇద్దరు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి జీవితంపై విరక్తి చెంది నదిలో దూకి గల్లంతయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన బాలగురప్ప తన సమీప బంధువు కర్మకాండకు నది వద్దకు వచ్చి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. పోలీసులు గాలిస్తున్నారు.