News August 14, 2024

మహానుభావులను స్మరించుకోవాలి: పవన్

image

మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పొందటానికి జీవితాలు, ప్రాణాలు ధారపోసిన మహానుబావులందరినీ స్మరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ భారతీయులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తిరంగా వేడుకలు గ్రామగ్రామాన ఒక పండుగ వాతావరణంలో చేసుకునేందుకు పంచాయతీలకు జెండా పండుగకు అవసరమైన నిధులు పెంచుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు.

Similar News

News September 15, 2024

యడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

image

యడ్లపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా నిడమర్రుకి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) అనే ఇద్దరు కారు టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు మార్జిన్‌లో టైరు మారుస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

News September 15, 2024

నేడు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మంగళగిరి కోర్టు 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు ప్రశ్నించనున్నారు.

News September 15, 2024

గుంటూరులో బాలికపై అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్

image

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరు పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన 10వ తరగతి విద్యార్థినిని అదే ప్రాంతంలో నివాసం ఉండే కార్ల పెయింటర్ షేక్. కాలేషా అనే వ్యక్తి భయపెట్టి తన ఇంటిలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.