News April 5, 2025

మహాముత్తారం మండలంలో అకాల వర్షం.. అపార నష్టం

image

భూపాలపల్లి జిల్లాలో వర్షం దంచికొట్టింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కురిసిన వర్షాలతో మహాముత్తారం మండలంలోని సింగారం, రేగులగూడెం, బోర్లగూడెం, మీనాజిపేట, నర్సింగాపూర్ గ్రామాల్లో మిర్చి, వరి రైతులకు తీరని నష్టం జరిగింది. చేతికందే దిశలో ఉన్న వరి నేలవాలడంతో రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు. మిర్చి పంటకు ధర లేదని, తడిసిన మిర్చికి ధర రాదని ఆవేదన వ్యక్తం చేశారు.  

Similar News

News April 7, 2025

NLG: కొత్త కార్డుల కోసం ఎదురుచూపులు

image

రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం సగానికి పైగా లబ్ధిదారులు తినకపోవడం.. తీసుకున్న బియ్యం టిఫిన్ల కోసం వినియోగించేవారు. తినడానికి పనికి రాని బియ్యంకోసం ఏం ఆశపడుతామని మౌనంగా ఉన్న కార్డులేని వారు.. సన్న బియ్యం ఇవ్వడంతో తమకు కార్డు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

News April 7, 2025

ములుగు: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

image

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.

News April 7, 2025

వరంగల్: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

image

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!