News May 10, 2024

మహాముత్తారం: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహాముత్తారం కాంగ్రెస్ మండల <<13216465>>అధ్యక్షురాలు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆమె కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మహాముత్తారంలో కీర్తిబాయి(45) ప్రచారం నిర్వహించారు. అనంతరం పెగడపల్లిలో ప్రచారం నిర్వహించడానికి ఆమె భర్తతో కలిసి కారులో వెళ్తుండగా నిమ్మగూడెం వద్ద కారు అదుపుతప్పి మట్టి కుప్పను ఢీకొట్టింది. దీంతో కీర్తిబాయి అక్కడికక్కడే మృతిచెందారు.

Similar News

News January 9, 2026

KNR: స్కూళ్లలో ‘ఫిర్యాదుల పెట్టె’.. వేధింపులకు ఇక చెక్!

image

పాఠశాల విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేపట్టిన ‘ఫిర్యాదుల పెట్టె’ ఆలోచన ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొమ్మకల్ హైస్కూల్‌లో ఈ పెట్టెను ఆమె స్వయంగా పరిశీలించారు. వేధింపులు, సమస్యలు ఎదురైతే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా పోలీసుల పర్యవేక్షణలో వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. కలెక్టర్ అద్భుతమైన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News January 9, 2026

రామడుగు కేజీబీవీలో కలెక్టర్ తనిఖీ

image

రామడుగు మండలం వెదిర కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, తరగతి గదులను తనిఖీ చేసిన ఆమె.. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుద్ధజలం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

News January 9, 2026

కరీంనగర్: ‘మహిళల ఆరోగ్యమే కుటుంబానికి రక్ష’

image

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, గ్రామం అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. KNR బొమ్మకల్‌‌లో నిర్వహించిన మహిళా సంక్షేమ సభలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఆరోగ్య మహిళ’ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించాలని సూచించారు. అంగన్‌వాడీలో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తారన్నారు.