News April 15, 2025
మహారాజ్ బావోజీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొడంగల్‌లోని భూనీడ్ శ్రీ గురు లోక్ ప్రభు మహారాజ్ బావోజీ జాతర బ్రహ్మోత్సవాల్లో సోమవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బావోజీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం కొడంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 27న ఎల్కతుర్తి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలన్నారు.
Similar News
News December 5, 2025
సికింద్రాబాద్: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

సికింద్రాబాద్‌లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్నారు. దీంతో 15 కిలోమీటర్లు బోయిన్‌పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్ రూ.కోట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 5, 2025
క్షమాపణ కోరిన రంగనాథ్

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. బతుకమ్మ కుంట వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణ కోరారు. ఆ స్థలంలో యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వగా రంగనాథ్ ఉల్లంఘించారంటూ సుధాకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా కమిషనర్ వెళ్లలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో రంగనాథ్ కోర్టుకు వెళ్లారు.
News December 5, 2025
కరీంనగర్: ‘కడుపులు కోసేస్తున్నారు’

ఉమ్మడి KNRలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డెలివరీ అంటేనే జనాలు జంకుతున్నారు. నార్మల్ డెలివరీలకు అవకాశమున్నా క్రిటికలంటూ సర్జరీలు చేస్తున్నారు. ప్యాకేజీల పేరుతో ఒక్కో డెలివరీకి రూ.60వేలు దోచుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది JAN- OCT వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు 356 జరగగా C సెక్షన్ సర్జరీలే 2,490 ఉన్నాయంటే దోపిడీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 83% సర్జరీ డెలివరీలే చేస్తున్నారు.


