News November 17, 2024

మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన బొల్లినేని

image

మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటి వార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాల్గొన్నారు.

Similar News

News November 7, 2025

నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?

News November 7, 2025

నెల్లూరు: లోకేష్ వార్నింగ్ ఎవరికో..?

image

దగదర్తిలో నారా లోకేశ్ ఇచ్చిన వార్నింగ్ కలకలం రేపుతోంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరుస్తూ పోస్టులు పెట్టడాన్ని గమనించాం. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.. యాక్షన్‌లో చూపిస్తాం’ అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారనేది టీడీపీలో కాక రేపుతోంది.

News November 6, 2025

రేపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రాక

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు నెల్లూరు VRC మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక లక్ష దీపోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు డీఆర్సీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4.15 గంటలకు కొండ బిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని మంత్రి దర్శించుకుంటారు.