News February 24, 2025

మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: అచ్చెన్న 

image

ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా టెక్కలి ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులకు సోమవారం చరవాణిలో మాట్లాడారు. దర్శనానికి వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News November 12, 2025

శ్రీకాకుళం: 13 నుంచి పదవ తరగతి ఫీజు చెల్లింపునకు అవకాశం

image

పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజును ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు చెప్పారు. జిల్లాలోని 450 ప్రభుత్వ, 196 ప్రైవేట్ పాఠశాలల్లో 22,890 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించాలని చెప్పారు. గడువు దాటితే అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

News November 12, 2025

హిరమండలం: పెన్షన్ మంజూరు చేయాలని వేడుకోలు

image

హిరమండలంలోని భగీరధపురం గ్రామానికి చెందిన హరిపురం ఆదిలక్ష్మి (32) పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు బయోమెట్రిక్ పడకపోవడంతో తండ్రిని నామినీగా ఉంచి పింఛన్ అందిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రిందట తండ్రి మరణించడంతో పింఛనుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. సాంకేతిక కారణాలను తొలగించి పింఛను అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.

News November 12, 2025

SKLM: నవంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ జునైద్ అహమ్మద్ మౌలానా పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో ఉన్న న్యాయ సేవ అధికారి సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం జరిగేందుకు కృషి చేయాలన్నారు.