News February 11, 2025

మహాశివరాత్రి ఏర్పాట్ల సమీక్ష లో పాల్గొన్న మంత్రి అనగాని

image

శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన సహచర మంత్రులతో కలిసి ఏర్పాట్లలో చేపట్టవలసిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 26, 2025

టేకులపల్లిలో వడదెబ్బకు రైతు మృతి

image

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మద్రాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండంగుల బోడుకి చెందిన కేలోతు గోబ్రియా అనే రైతు వడదెబ్బతో మృతి చెందారు. ఆయన సోమవారం తన పొలంలో పండించిన కూరగాయలు, నువ్వులు కోయడానికి వెళ్లి ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందాడు.

News March 26, 2025

KNR: జపాన్-ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి యువ ఆవిష్కర్త ఎంపిక

image

కరీంనగర్‌కు చెందిన యువ ఆవిష్కర్త శుభ శ్రీ సాహు ఓ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నప్పుడు రైతులకోసం ఒక వినూత్న వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఇటీవల ఆ ప్రాజెక్టు రూపొందించిన శుభ శ్రీ జపాన్౼ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుభ శ్రీ ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పాఠశాల ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు.

News March 26, 2025

మెగాస్టార్-అనిల్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

image

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిని వినోదభరితమైన చిత్రంగా రూపొందిస్తారని పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే చిరు ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకోగా, మే 9న విడుదల కానుంది. ఇక అనిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!