News February 22, 2025
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన దేవదాయ శాఖ ఏసీ

పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం దేవాలయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్ పరిశీలించారు. ఆలయంలో ఏర్పాటుచేసిన క్యూ లైన్, చలువ పందిళ్లు, లడ్డు తయారీని పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతర ఏర్పాట్ల వివరాలను ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబును అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 7, 2025
వనపర్తి: రేపు కలెక్టరేట్లో సామూహిక వందేమాతరం గేయాలాపన

వనపర్తి కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గేయం రచించి 150 సం.లు పూర్తి అయిన సందర్భంగా ప్రతిఒక్కరూ గేయాలాపన చేయాలని సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం గేయాలాపన చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
News November 7, 2025
గోదావరిఖని: త్వరలో 473 మందికి కారుణ్య ఉత్తర్వులు

సింగరేణిలో మెడికల్ పూర్తి చేసి ఇప్పటి వరకు కారుణ్య నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది అభ్యర్థులకు ఈనెల 12న కొత్తగూడెం వేదికగా నియామక పత్రాలు అందజేస్తామని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేస్తారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వంపై తాము తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఇది జరుగనుందని తెలిపారు.
News November 7, 2025
బాల్య వివాహాలను నిషేధించడం ప్రతి ఒక్కరి బాధ్యత: పెద్దపల్లి కలెక్టర్

బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో “బేటి బచావో బేటి పడావో” కార్యక్రమంలో బాల్య వివాహాల నిరోధన పోస్టర్ను ఆవిష్కరించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధం, వయసు 18 కంటే తక్కువ ఉన్న అమ్మాయిలకు మానసిక, శారీరక, ఆర్థిక నష్టాలు కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


