News February 22, 2025

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన దేవదాయ శాఖ ఏసీ

image

పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం దేవాలయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్ పరిశీలించారు. ఆలయంలో ఏర్పాటుచేసిన క్యూ లైన్, చలువ పందిళ్లు, లడ్డు తయారీని పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతర ఏర్పాట్ల వివరాలను ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబును అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 22, 2025

అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్ రూ.175 కోట్లు?

image

‘పుష్ప-2’ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా దూసుకెళుతున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో తీసే మూవీకి బన్నీ రూ.175 కోట్లు తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. దీంతోపాటు లాభాల్లో 15% వాటా ఇచ్చేలా ‘సన్ పిక్చర్’తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా అక్టోబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు టాక్.

News March 22, 2025

BREAKING: 357 బెట్టింగ్ సైట్స్ బ్లాక్

image

పన్ను ఎగ్గొడుతున్న ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లపై కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన DGGI కొరడా ఝుళిపించింది. 357 వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఆయా సంస్థలకు చెందిన 2,400 అకౌంట్లలోని రూ.126 కోట్లను సీజ్ చేసింది. దాదాపు 700 విదేశీ సంస్థలు ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్/గ్యాంబ్లింగ్ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 22, 2025

సంగారెడ్డి: హిందీ పరీక్షకు 99.82 శాతం హాజరు

image

పదో తరగతి హిందీ పరీక్షకు 99.82% విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. మొత్తం 22,404 మంది విద్యార్థులకు 22,363 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. కోహిర్‌లో ఒకటి, జహీరాబాద్‌లో ఐదు, మొగుడంపల్లిలో ఒక పరీక్ష కేంద్రాన్ని తాను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌ 36 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు వివరించారు.

error: Content is protected !!