News February 21, 2025
మహాశివరాత్రి జాతర నేపథ్యంలో హెల్ప్ లైన్స్ నంబర్లు ఇవే..!

వేములవాడ పట్టణంలో జరిగే మహాశివరాత్రి జాతర నేపథ్యంలో హెల్ప్ లైన్స్ నంబర్లు ఇవే..రెవెన్యూ డివిజనల్ అధికారి,వేములవాడ – 7032675222,A.S.P 8712656412,ఈఓ 9491000743,టౌన్ ఎమ్మార్వో 7337234446,వేములవాడ టౌన్ సీఐ – 87126 56413,వైద్యాధికారి 94400 78901మున్సిపల్ కమీషనర్ కమిషనర్ 78959,స్టేషన్ ఫైర్ ఆఫీసర్, (అగ్నిమాపక కేంద్రం) వేములవాడ – 87126 99261,ప్రోటోకాల్ ఆఫీస్ వేములవాడ : 08723-236040.
Similar News
News November 24, 2025
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత బాధ్యతలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ నూతన డీసీపీగా దార కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెను.. సెంట్రల్ జోన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. డీసీపీ కవిత హైదరాబాద్ సైబర్ విభాగం పనిచేస్తూ బదిలీపై WGL సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించబడ్డారు.
News November 24, 2025
హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.
News November 24, 2025
సిద్దిపేట: అకాల వర్షాలు.. అలర్ట్గా ఉండండి: కలెక్టర్

జిల్లాలో రాబోయే నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులందరూ అలెర్ట్గా ఉండాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి అన్ని శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. వర్షాల నుంచి ధాన్యం తడవకుండా రైతులకు వెంటనే టార్పాలిన్ కవర్లు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.


