News February 25, 2025
మహాశివరాత్రి.. మల్లన్న బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు: CP

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మహాశివరాత్రి, పెద్దపట్నం, సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న శివాలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 26న మహాశివరాత్రి పెద్దపట్నం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 26, 2025
NTR: ఎమ్మెల్సీ పదవి రేసులో విజయవాడ కీలక నేత..?

2025 మార్చిలోపు రాష్ట్రంలోని అయిదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఈ సారి విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాధకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.
News February 26, 2025
మహా శివరాత్రితో మహా కుంభమేళాకు తెర

ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక మహాకుంభ మేళా నేటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినంతో ఈ మహత్తర కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చివరి రోజైన ఇవాళ 2 కోట్ల మంది రానున్నట్లు అంచనా.
News February 26, 2025
బ్రహ్మ, విష్ణువు మధ్య వివాదం.. శివుడు ఏం చేశాడంటే?

విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరుగొప్ప అనే వివాదం తలెత్తుతుంది. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, లింగానికి ఆది, అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని చెబుతాడు. విష్ణువు మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. బ్రహ్మ ఆది తెలుసుకోవాలని చూసి విఫలమవుతాడు. అయితే తాను ఆది కనుగొన్నట్లు మొగలిపువ్వు, గోవుతో శివుడికి అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. అది తెలిసి బ్రహ్మ, మొగలిపువ్వు, గోవును శివుడు శపిస్తాడు.