News January 29, 2025

మహా కుంభమేళాకు విశాఖ నుంచి RTC సర్వీసులు

image

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఫిబ్రవరి 4,8,12 తేదీలలో విశాఖ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నాయుడు తెలిపారు. ప్రయాగ రాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా 7 రోజుల ప్రణాళికను రూపొందించారు. పూర్తి వివరాలకు www.apsrtconline.in వెబ్‌సైట్, బస్సు స్టేషన్‌లో బుకింగ్ కౌంటర్‌లో సంప్రదించాలన్నారు.

Similar News

News March 12, 2025

విశాఖలో రూ.100కు చేరిన నిమ్మ..! 

image

విశాఖ 13 రైతు బజార్‌లో బుధవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.16, ఉల్లి రూ.23, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.30, బెండ రూ.42, బీరకాయలు రూ.48 , క్యారెట్ రూ.22/26, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, గ్రీన్ పీస్ రూ.54, గుత్తి వంకాయలు రూ.36, కీర రూ.22, గోరు చిక్కుడు రూ.34, నిమ్మకాయలు రూ.100, ఉసిరి కాయలు(హైబ్రిడ్) రూ.100, పొటల్స్ రూ.90గా నిర్ణయించారు.

News March 12, 2025

గాజువాక: ఎలక్ట్రికల్ పోల్ పడి ఒకరు మృతి 

image

గాజువాక సమీపంలో గల నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో కే.కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలవ్వగా స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News March 12, 2025

విశాఖ: రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి అలర్ట్

image

జీవీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయినవారు TDR పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు మంగళవారం తెలిపారు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అధికారులు నిబంధనల ప్రకారం దరఖాస్తు పరిశీలించి TDRపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. పూర్తి వివరాలకు జోనల్ కార్యాలయాలలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!