News January 31, 2025
మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేయడం జరిగిందని వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10:20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5:45కు గోరఖ్‌పూర్‌లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News February 1, 2025
విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు
వాల్తేర్ డివిజన్లో సాంకేతిక కారణాల వల్ల విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పలాస (67289/90)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 1, 2025
విజయనగరం వరకే విశాఖ-పార్వతీపురం ట్రైన్
వాల్తేర్ డివిజన్లో సాంకేతిక కారణాలతో పలు రైళ్ల గమ్యం కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పార్వతీపురం(67287/88)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 విజయనగరం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పార్వతీపురానికి బదులుగా విజయనగరం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News January 31, 2025
విశాఖలో సర్వర్ డౌన్‌తో అవస్థలు
విశాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్‌తో అవస్థలు పడుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం భూమి విలువను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజువారి రిజిస్ట్రేషన్ల కంటే శుక్రవారం మరింత ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఆసక్తి చూపారు. మరోపక్క సర్వర్లు మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాత్రి 12 వరకు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.